బంగాళాఖాతంలో సెప్టెంబర్ 2 తర్వాత కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా, దాని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించారు. అలాగే, ప్రకాశం, నెల్లూరు, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.
సెప్టెంబర్ 2 తర్వాత మరో అల్పపీడనం
August 29, 2025
0
Tags