సెప్టెంబరు 9 నుంచి దుబాయ్, అబుదాబిలోప్రారంభమయ్యే ఆసియా కప్ టీ20 క్రికెట్ పోటీలకు టీమిండియా మేనేజర్‌గా నియమితులైన పీవీఆర్ ప్రశాంత్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు. భీమవరం జనసేన ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) కుమారుడైన ప్రశాంత్ విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌ను కలిశారు. తెలుగు వ్యక్తికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల డిప్యూటీ సీఎం ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రశాంత్ మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఉపాధ్యక్షుడిగా పని చేసిన ప్రశాంత్.. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అల్లుడు. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించారు.
ఆసియా కప్ టీ20కి టీమిండియా మేనేజర్‌గా ప్రశాంత్ : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు
August 30, 2025
0
Tags