లక్నో-బారౌనీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ-2 టైర్‌ డక్ట్‌లో లిక్కర్‌ బాటిళ్లు !

Telugu Lo Computer
0


లక్నో-బారౌనీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ-2 టైర్‌ తీసుకుంటే అందులో ఏసీ సరిగ్గా పని చేయడం లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దాంతో ట్రైన్‌ను ముందస్తు షెడ్యూల్‌ అనేది లేకుండా చెక్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఏసీ డక్ట్‌లో లిక్కర్‌ బాటిళ్లను దాచి పెట్టడమే అని అధికారులు కనుగొన్నారు. తనిఖీలు చేసే క్రమంలో పేపర్లతో కట్టిన రెండు బండిల్స్‌ బయటపడ్డాయి. వాటిని తెరిచి చూడగా అందులో లిక్కర్‌ బాటి్ళ్లు ఉ‍న్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సోనాపూర్‌ డీఆరర్‌ఎమ్‌ మాట్లాడుతూ ' ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఆ అక్రమ లిక్కర్‌ను సీజ్‌ చేశాం. కూలింగ్‌ లేదని విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన ప్రయాణికులు ధన్యవాదాలు' అని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)