అక్టోబర్‌ 1 నుంచి యూపీఐలో 'కలెక్ట్‌ రిక్వెస్ట్‌' ఫీచర్‌ను నిలిపివేత

Telugu Lo Computer
0


యూపీఐలో 'కలెక్ట్‌ రిక్వెస్ట్‌' ఫీచర్‌ను నిలిపివేయనున్నారు. అక్టోబర్‌ 1 నుంచి సేవలు నిలిపివేయాలని బ్యాంకులు, పేమెంట్‌ యాప్స్‌కు ఎన్‌పీసీఐ సూచిస్తూ ఇటీవల సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, యూపీఐ యాప్స్‌ ఇందుకు అనుగుణంగా తమ సిస్టమ్స్‌లో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఎన్‌పీసీఐ ఆదేశాల నేపథ్యంలో గడువు తర్వాత బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి యాప్స్‌ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ సేవలను అందించకూడదు. కలెక్ట్‌ ట్రాన్సాక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాసెస్‌ చేయకూడదు. సాధారణంగా నగదు స్వీకరించేటప్పుడు యూపీఐ పిన్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేదు. కానీ, డబ్బులు పంపించామన్న నెపంతో కొందరు కేటుగాళ్లు యూపీఐ పిన్‌ ఎంటర్ చేయించి నగదు కొట్టేస్తున్న ఉదంతాలు ఎన్‌పీసీఐ దృష్టికి వచ్చాయి. ఈ కారణంతోనే 2019లో పుల్‌ ట్రాన్సాక్షన్లలో గరిష్ఠ పరిమితిని రూ.2 వేలకు ఎన్‌పీసీఐ పరిమితం చేసింది. అయినప్పటికీ ఈ తరహా మోసాలు కొనసాగుతుండడంతో ఎన్‌పీసీఐ ఈ సేవలకు చరమగీతం పాడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)