పీఎం ఉజ్వల యోజనకు రూ.12,000 కేటాయింపు

Telugu Lo Computer
0

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ పలు నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఉజ్వల యోజనకు 2025-26 సంవత్సరానికి రూ.12,000 కోట్ల  కేటాయించింది. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సాంకేతిక విద్యా పథకానికి 4200 కోట్ల రూపాయలను కేటాయించింది. అస్సాం, త్రిపురకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద 4250 కోట్ల రూపాయలు కేటాయింపులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరక్కనం - పుదుచ్చేరి నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. రూ. 2001 కోట్ల రూపాయల ఖర్చుతో రహదారి నిర్మాణానికి కేబినెట్‌ ఒకే చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)