కర్ణాటకలోని బెళగావి జిల్లా యరగట్టి తాలూకాకు చెందిన వినోద్ మాలశెట్టి (30) తన స్నేహితుడు అభిషేక్ కొప్పాడ్ వివాహం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విందు వేడుకకు హాజరయ్యాడు. అభిషేక్ తన పొలంలో ఈ వివాహానంతర విందును ఘనంగా ఏర్పాటు చేశాడు. పెళ్లి విందులో ఆహారం వడ్డిస్తున్న విఠల్ హరుగొప్ప అనే వ్యక్తిని వినోద్ మరో చికెన్ ముక్క వేయాలని అడిగాడు. వినోద్ తనకు తక్కువగా చికెన్ వడ్డించారని ఫిర్యాదు చేశాడు. ఇంకొంచెం చికెన్ వేయాలనే చిన్నపాటి డిమాండ్‌తో వినోద్, విఠల్‌ల మధ్య మొదట మాటల యుద్ధం జరిగింది. అది క్రమంగా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వాదన తీవ్రస్థాయికి చేరడంతో విఠల్ కోపోద్రిక్తుడయ్యాడు. ఆవేశంలో అక్కడే ఉల్లిపాయలు కోయడానికి ఉపయోగిస్తున్న ఒక కత్తిని తీసుకుని వినోద్‌ను పొడిచాడు. కత్తిపోటు కారణంగా వినోద్ తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు విఠల్ హరుగొప్పపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ ఘటన వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
పెళ్లి విందులో హత్యకు దారితీసిన 'చికెన్ ముక్క' గొడవ
July 14, 2025
0
Tags