ఎస్తోనియా సహకారంతో హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌ : శ్రీధర్‌బాబు

Telugu Lo Computer
0


స్తోనియా దేశ రాయబారి మ్యారియే లూప్‌ ఆధ్వర్యంలో ఆ దేశ వాణిజ్య ప్రతినిధుల బృందంతో సచివాలయంలో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-గవర్నెన్స్‌, హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామన్నారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికత, సైబర్‌ సెక్యూరిటీలో కూడా కలిసి పనిచేయాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని మంత్రి కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తి రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, తమతో కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. సెప్టెంబరులో తమ దేశం సందర్శించాలని శ్రీధర్‌బాబును ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ కోరారు. తమ అధికారుల బృందం వచ్చి విద్య, ఈ-గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్‌లో పరస్పరం సహకారంపై చర్చిస్తుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్ సంజయ్ కుమార్, మీ సేవ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)