జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు పెడతారా?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు నమోదు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అనుమతి ఉన్న కారులో వెనక సీట్లో కూర్చుని ప్రయాణిస్తే కూడా కేసు పెడతారా అని చంద్రబాబుని పేర్నినాని ప్రశ్నించారు. మరి గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రి పుష్కరాల్లో స్నానాలు చేస్తూ షూటింగ్ తీస్తున్న క్రమంలో 30 మంది భక్తులు చనిపోయారు.. చనిపోయిన భక్తుల బంధువులు కేసులు పెడితే రానున్న మా ప్రభుత్వంలో మీతో పాటు వెనక మీ కుటుంబ సభ్యులు, నీ కుమారుడు లోకేష్, సినిమా డైరెక్టర్ పై ఎందుకు కేసులు పెట్టకూడదని చంద్రబాబును పేర్నినాని ప్రశ్నించారు. అలాగే, గుంటూరులో రూ 50 రూపాయల చీరలు లారీల్లో తీసుకొచ్చి చంద్రన్న కానుక పేరుతో మహిళలపై విసిరితే ఆ రద్దీలో చనిపోయిన వారి బంధువులు ఫిర్యాదు చేస్తే కేసులు ఎందుకు పెట్టకూడదని పేర్నినాని ప్రశ్నించారు. కందుకూరులో ఇరుకు సందులో నీవు మీటింగ్ పెట్టినప్పుడు మృతి చెందిన వారి బంధువులు కేసు ఎందుకు పెట్టకూడదు అన్నారు.. 2029లో వచ్చే తమ ప్రభుత్వంలో ప్రస్తుతం మీరు వ్యవహరిస్తున్న కక్షపూరిత కేసులకు ప్రతీకార చర్యలకు ధీటుగా సమాధానం చెప్తామని వెల్లడించారు. ఇక, కొల్లు రవీంద్ర వట్టి సొల్లు రవీంద్ర అని అన్నారు. ఇటీవల మచిలీపట్నం విచ్చేసిన మంత్రి నారా లోకేష్, కొల్లు రవీంద్ర చీమకు కూడా హాని చేయడని పేర్కొన్నాడు. ఇది నిజమే కొల్లు రవీంద్ర చీమకు, దోమలకు హానిచేయడు. కానీ, మనుషులను ఇబ్బందులకు గురి చేస్తాడని మాజీ మంత్రి పేర్నినాని చెప్పుకొచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)