విశాఖ సాగర తీరంలో కొత్త రోప్​ వే, గ్లాస్‌ బ్రిడ్జి !

Telugu Lo Computer
0


కొత్త అందాలతో ముస్తాబవుతోంది. నగర అందాలను వీక్షించేందుకు కైలాసగిరి వద్ద కొత్త పర్యాటక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కొత్త ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇప్పటికే కైలాసగిరి కొండపై జిప్‌ లైనర్, స్కై సైక్లింగ్‌ నిర్వహిస్తున్నారు. త్వరలో 'గ్లాస్‌ బ్రిడ్జి' సైతం విశాఖలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న రోప్ వే రద్దు చేసి కొత్తది ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను ప్రణాళికలు సిద్దం చేసారు. కైలాసగిరి వద్ద ప్రస్తుతం ఉన్న రోప్‌వేను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కంపెనీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన లీజు ముగియడంతో లైసెన్సు రద్దు చేసి అక్కడ కొత్త రోప్ వే నిర్మించా లని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న రోప్‌వే క్యాబిన్లు పాత తరహాలో ఉన్నాయి. అదే విధంగా ఇది కింది నుంచి కేవలం 400 మీటర్ల మాత్రమే ప్రయాణిస్తుంది. తక్కువ సమయంలో ప్రయాణం పూర్త వుతుంది. దీంతో పర్యాటకులకు రోప్​వేలో ప్రయాణించిన అనుభూతి కలగడం లేదు. కొత్తగా నిర్మించనున్న రోప్‌వే కొండ కింద సముద్రం సమీపంగా తెలుగు మ్యూజియం వరకు వెళ్లేలా రూట్ నిర్ణయించారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అదే విధంగా గ్లాస్ బ్రిడ్జి ఆగస్టుకి అందుబాటులోకి వస్తుందని వీఎంఆర్డీఏ అధికారులు తెలిపారు. అత్యాధునిక రోప్‌వే ప్రజలకు గొప్ప అనుభూతి కలిగిస్తుందని చెబుతున్నారు. తాజా ప్రతిపాదనల మేరకు తెన్నేటిపార్క్‌ వద్ద ప్రారంభమవ్వనున్న కొత్త రోప్‌వే కైలాసగిరి కొండ మీదుగా ప్రయాణిస్తూ తెలుగు మ్యూజియం వద్దకు చేరుకోవడంతో ముగుస్తుంది. తిరిగి అక్కడ నుంచి ఎక్కి కిందికి చేరుకోవచ్చు. కిలోమీటరున్నర మేర నిర్మించనున్న ఈ కొత్త మార్గంలో 4 స్టేషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. పర్యాటకులు వారికి నచ్చిన చోట ఎక్కడైనా దిగొచ్చు. అలాగే నచ్చిన చోట ఎక్కడైనా మళ్లీ ప్రారంభం అవ్వొచ్చు. ప్రతి రోప్‌వే స్టేషన్లో 2 లిఫ్టులు, వెయిటింగ్ రూమ్, ఫుడ్‌ స్టాల్, ఫొటో స్టాల్, నీటి సదుపాయం ఉంటుంది. తెన్నేటిపార్క్‌ వద్ద 90 కార్లు, 100 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. రోప్ వే క్యాబిన్ల పైన చర్చల తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)