విజయ మిల్క్ ప్యాకెట్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు పోస్టర్ ను ముద్రించి పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఫొటోలు కూడా వైరల్ కావడంతో వివాదం మొదలైంది. దీనిపై ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ స్పందించింది. కృష్ణా మిల్క్ యూనియన్ గురించి సోషల్ మీడియాతో పాటు కొన్ని ఇతర వేదికల ద్వారా "విజయ మిల్క్ ప్యాకెట్‌లపై హరి హర వీర మల్లు పోస్టర్ ప్రచురించినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని తెలిపింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమైనవని, సత్యధూరం అనే విషయం యూనియన్ స్పష్టంగా తెలియజేస్తుందని పేర్కొంది. ఫోటో షాప్ ద్వారా చేసిన ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకొని బడతాయని హెచ్చరించింది.గత 60 ఏళ్లుగా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన పాడి రైతుల సంస్థపై ఇటువంటి దుష్ప్రచారం చేయడం శోచనీయమని సంస్ధ ఎండీ కొల్లి ఈశ్వర బాబు తెలిపారు. విజయ ఉత్పత్తులపై ఎటువంటి ఇతర ప్రచారాలు ఎన్నడూ చేయలేదని, చేయబోము అని కూడా తేల్చిచెప్పారు. ఈ రకమైన అవాస్తవమైన ప్రచారాలు యూనియన్ పరువుకు భంగం కలిగించే అవకాశమున్నందున, ప్రజలు, మీడియా ప్రతినిధులు, వినియోగదారులు ఈ వార్తలను నమ్మొద్దని కోరారు.పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లును త్వరలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ప్రచారంలో భాగంగా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను తొలుత విశాఖలో నిర్వహించేందుకు ప్లాన్ చేసినా తాజాగా హైదరాబాద్ కు మార్చారు. వచ్చే నెలలో విడుదలయ్యే ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో విజయ మిల్క్ ప్యాకెట్లపై హరిహర వీరమల్లు పోస్టర్లు దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది.
విజయ పాల ప్యాకెట్లపై పవన్ హరిహర వీరమల్లు ప్రచారం ?
July 18, 2025
0
Tags