సింగయ్య మృతి కేసులో పోలీసులు జగన్‌ను విచారించకుండా ఏపీ హైకోర్టు స్టే

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను సింగయ్య మృతి కేసులో పోలీసులు విచారించకుండా ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలుకు ఏజీ 2 వారాల గడువు కోరగా, విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. దాంతో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు వైఎస్ జగన్‌ వెళ్తుండగా వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. జగన్‌ కాన్వాయ్‌ కారణంగానే సింగయ్య మృతి చెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ జగన్‌తో పాటు పలువురు నేతలు క్వాష్‌ పిటిషన్లు వేశారు. వాటంన్నింటిని హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈరోజు కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపి వేస్తూ ఏపీ హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణలో పురోగతి ఏం ఉందని న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)