ముంబైకి చెందిన 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు తన దగ్గర చదువుకునే 16 ఏళ్ల విద్యార్ధికి ఆందోళన నిరోధక మందులు (యాంటీ యాంగ్జైటీ మందులు) ఇచ్చి, ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తోంది. ఈ విషయం బయటపడిన దరిమిలా పోలీసులు ఆ మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. ఆమెపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టం, భారత శిక్షాస్మృతిలోని నిబంధనల కింద నేరాలను మోపారు. పోలీసులు తెలిపిన ప్రకారం నిందితురాలు ఆంగ్ల ఉపాధ్యాయురాలు. బాధిత విద్యార్థి 11వ తరగతిలో ఉన్నప్పుడు అతనికి పాఠ్యాంశాలను బోధించారు. 2023 డిసెంబర్‌లో జరిగిన పాఠశాల వార్షికోత్సవం సమయంలో ఆ విద్యార్థికి ఆకర్షితురాలినైనట్లు ఆమె పోలీసులకు తెలిపింది. 2024 జనవరి నుంచి ఆ విద్యార్థితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. తొలుత ఆమె ఆ బాలుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగికంగా వేధించేదని, తరువాత అతనికియాంటీ-యాంగ్జైటీ ముందులు ఇచ్చి లోబరుచుకునేదని పోలీసులు తెలిపారు.
విద్యార్థిపై మహిళా ఉపాధ్యాయురాలు అఘాయిత్యం !
July 02, 2025
0
Tags