విడాకులు వచ్చాయన్న అనందంలో పాలతో స్నానం చేసిన భర్త !

Telugu Lo Computer
0


స్సాంలోని నలబరి జిల్లాలో నివాసం ఉంటున్న మానిక్ అలీ చట్టపరంగా భార్యతో విడిపోయిన ఆనందంలో పాలతో స్నానం చేశాడు. నాలుగు బకెట్లలో 40 లీటర్ల పాలు తెచ్చుకున్న అలీ.. వాటితో తన ఇంటి బయటే స్నానం చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాకు స్వాతంత్ర్యం వచ్చింది. నేను ఇవాళ్టి నుంచి ఫ్రీ అయిపోయాను అంటూ కేకలు కూడా వేశాడు. 'ఆమె తన ప్రేమికుడితో పారిపోతూనే ఉంది. మా కుటుంబ శాంతి కోసం నేను మౌనంగా ఉండిపోయాను' అని తన భార్య గురించి అలీ చెప్పాడు. అలీ భార్య గతంలో రెండుసార్లు ప్రియుడితో పారిపోయిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆ జంట తమ వివాహాన్ని చట్టబద్ధంగా ముగించాలని పరస్పరం నిర్ణయించుకుందని వెల్లడించారు. భార్య తీరుతో విసిగిపోయిన భర్త అలీ.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక కోర్టు వారికి డివోర్స్ మంజూరు చేసింది. 'విడాకులు మంజూరు అయ్యాయని నా న్యాయవాది నాకు తెలియజేశారు. నాకు స్వాతంత్ర్యం వచ్చినట్లుంది. ఈరోజు నుంచి నేను స్వేచ్ఛగా ఉండొచ్చు. విడాకులు మంజూరైన ఆనందంలోనే నేను ఇలా 40 లీటర్ల పాలతో స్నానం చేస్తున్నా' అని అలీ చెప్పాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)