మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి ఈడీ జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సోమవారంనాడు సమర్ధించింది. హైకోర్టు నిర్ణాయాన్ని సవాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని హెచ్చరించింది. ట్రయిల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్ధించారని, అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో తీర్పులు వచ్చాయని, వాటిని ఈడీ తిరగరాసే ప్రయత్నం చేయడం అనవసరమని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ పోరాటాలతో మీకేం పని అని ఈడీని నిలదీసింది. 'రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగనీయండి. మీకేం పని?' అని అని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో తమ పిటిషన్‌ను వెనక్కి తీసుంటామని ఈడీ తరఫు హాజరైన సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు ధర్మాసనానికి తెలిపారు. దీంతో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు సీజేఐ ప్రకటించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దు : ఈడీని హెచ్చరించిన సుప్రీంకోర్టు
July 21, 2025
0
Tags