సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులకు AIలో శిక్షణ అందిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 3,34,000 మందికి పైగా పౌరులు లబ్ధి పొందారని ప్రభుత్వం ప్రకటించింది. నాన్-ప్రాఫిట్ సెక్టార్ ఫోరమ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ 2025 సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది. రియాద్ లో ఈ సదస్సు ఏర్పాటైంది. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అల్‌ఘమ్ది మాట్లాడుతూ చిరు వ్యాపారులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలకు AIలో శిక్షణ ఇవ్వడం వల్ల సత్ఫలితాలను సాధిస్తోన్నామని అన్నారు. ఏఐ ద్వారా తమ వ్యాపారాలను మరింత విస్తారం చేసుకోవడానికి వారికి అవకాశం లభించిందని, ఫలితంగా పలువురికి ఉపాధి ఇవ్వగలుగుతున్నారని చెప్పారు. ఈ విషయంలో సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని, కమ్యూనిటీ అవగాహన పెంచడంలో రెండవ స్థానంలో ఉందని అబ్దుల్లా అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా డిజిటలైజేషన్, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యను అందించడంలో అగ్రదేశంగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోన్నామని చెప్పారు. సౌదీ అరేబియా AI సాధికారత కార్యక్రమం 'SAMAI'. దీన్ని గత ఏడాది సెప్టెంబర్ లో గ్లోబల్ AI సమ్మిట్ సందర్భంగా ప్రారంభించింది ఆ దేశ ప్రభుత్వం. సౌదీ డేటా అండ్ ఏఐ అథారిటీ), విద్యా మంత్రిత్వ శాఖ, మానవ వనరులు- సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా దీన్ని పర్యవేక్షిస్తోన్నాయి. 'SAMAI' కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ప్రోగ్రామింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇందులో 2.6 లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్, సెకండరీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 'ఫ్యూచర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామర్స్' వంటి కార్యక్రమాలను AI ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్తోంది అక్కడి ప్రభుత్వం. ఇందులో భాగంగా చేపట్టిన రోడ్ టు ATHKA' అనే కార్యక్రమం ద్వారా 5,70,000 మందికి పైగా విద్యార్థులకు AIలో శిక్షణ శిక్షణ ఇచ్చింది. అలాగే- 'ఫ్యూచర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామర్స్' కార్యక్రమం కింద మరో 10,000 మందికి పైగా ఉపాధ్యాయులు AIలో ట్రైనింగ్ పొందారు.
సౌదీ అరేబియాలో ఏఐతో లక్షలాది మందికి ఉపాధి
July 04, 2025
0
Tags