నేనెప్పుడూ నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతా : విజయ్‌ దేవరకొండ

Telugu Lo Computer
0


మునుపటితో పోలిస్తే ప్రస్తుతం పద్ధతిగా మాట్లాడుతున్నందుకు కారణమేంటని నటుడు విజయ్‌ దేవరకొండను ఓ విలేకరి ప్రశ్నించగా ''నేనెప్పుడూ నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతా. ఈరోజు ఇలా మాట్లాడాలని అనిపిస్తోంది. 'ఎవరూ నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్‌ చేసుకోవాలి. నేను అనుకున్నది సాధించాలి' అన్న ఆలోచనలతో కెరీర్‌ ప్రారంభంలో దూకుడుగా ఉన్నానేమో. సినిమాల్లోనూ చూస్తుంటాం కదా. హీరో ముందుగా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. అమ్మ, అమ్మాయి ఎవరో ఒకరి వల్ల తర్వాత సాఫ్ట్‌ అయిపోతాడు'' అని పేర్కొన్నారు. ఇది 'కింగ్డమ్‌'లో పోషించిన పాత్ర వల్ల వచ్చినా మెచ్యూరిటీనా? గత అనుభవాల వల్ల వచ్చిందా? అని అడగ్గా వయసు పెరుగుతోంది కదా అని సరదాగా అన్నారు. ఆ తర్వాత, జీవితం అన్నీ నేర్పిస్తుందని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)