సీనియర్ నటి ముచ్చర్ల అరుణ నివాసంలో ఈడీ సోదాలు

Telugu Lo Computer
0

సీనియర్ నటి ముచ్చర్ల అరుణ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆమె భర్త మోహన్‌ గుప్తాకు సంబంధించి వ్యాపార అక్రమ లావాదేవీలపై ఈడీ బృందం తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం. కపాలీశ్వరర్‌ నగర్‌లోని బంగ్లాలో 10 మందికిపైగా ఈడీ అధికారులు తనిఖీ చేపట్టినట్టు తెలిసింది. మోహన్‌ గుప్తా నిర్మాణ రంగంలో ఉన్నారు. 'సీతాకోక చిలుక' సినిమాతో ముచ్చర్ల అరుణ అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. 'చంటబ్బాయ్‌', 'జస్టిస్‌ చౌదరి', 'గీతాంజలి' (అతిథి పాత్ర) వంటి సినిమాలతో అలరించిన ఆమె వివాహానంతరం నటనకు దూరమయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)