మహారాష్ట్రలో గత మంగళవారం లుంగీ బనియన్‌తో ఉన్న శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆహారం నాణ్యత లేదని క్యాంటీన్ మేనేజర్‌పై దాడి చేశారు. పరిస్థితిలో మార్పురాకపోతే మళ్లీ ఇలాగే స్పందిస్తానని ఆయన హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. కాగా, మహారాష్ట్రలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ మేనేజర్‌పై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా వారు లుంగీలు, బనియన్లు ధరించారు. 'చడ్డీ బనియన్ గ్యాంగ్‌ను మేం ఖండిస్తున్నాం' అని నినాదాలు చేశారు. సంజయ్ గైక్వాడ్ ప్రవర్తన ప్రజా ప్రతినిధికి తగనిదని విమర్శించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహారాష్ట్రలో లుంగీ, బనియన్లు ధరించి ప్రతిపక్షాల వినూత్న నిరసన
July 16, 2025
0
Tags