తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ఉదయం వాకింగ్ చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. గత మూడు రోజులుగా ఆయన అక్కడే ఉండగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు.. ఒక బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన గుండె స్పందన రేటులో కొన్ని తేడాలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. ఈ తేడాలే ఆయనకు తలతిరగడానికి కారణమని నిర్ధారించారు. గుండె లయలో ఏర్పడిన ఈ తేడాలను సరి చేయడానికి హృద్రోగ నిపుణుడు డాక్టర్ జి. సెంగుట్టువేలు నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం ఆయనకు ఒక థెరప్యూటిక్ విధానాన్ని నిర్వహించింది. అలాగే ప్రతిరోజు నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్ష నివేదిక సాధారణంగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో రెండు రోజుల్లో ఆయన తన సాధారణ విధులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు.
చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్
July 24, 2025
0
Tags