మనసా దేవి ఆలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

Telugu Lo Computer
0


త్తరాఖండ్ లోని మనసా  దేవి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. మృతుల సంఖ్యను గడ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధ్రువీకరించారు. ''ఆరుగురు చనిపోయారు. నేను ఘటనా స్థలానికి బయల్దేరాను. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది'' అని వినయ్ శంకర్ పాండే చెప్పారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ పేర్కొంది. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఘటనా స్థలానికి ఎస్డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు చేరుకున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ట్వీట్ చేశారు. '' హరిద్వార్‌లోని మన్సా దేవి మందిరంలో తొక్కిసలాట జరిగిందనే విషాద వార్త తెలిసింది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్థానిక అధికారులతో నేను సంప్రదింపులు జరుపుతున్నా. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మొత్తం 35 మందిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆరుగురు చనిపోయారు. మిగతావారికి చికిత్స జరుగుతోంది. ఆలయానికి వెళ్లే దారిలోని మెట్లపై విద్యుత్ షాక్ సంభవించిందనే వదంతి వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్లుగా భావిస్తున్నాం. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఏఎన్‌ఐతో ప్రమేంద్ర సింగ్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)