స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు దక్కించుకున్న విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌ కింద ప్రతీ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు నగరాలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం గర్వకారణంగా నిలిచింది. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు చోటు దక్కించుకున్నాయి. విశాఖపట్నం నగరంకు "స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు" దక్కింది. ఇది జాతీయ స్థాయిలో పొందిన అత్యున్నత గుర్తింపు. విశాఖలో పారిశుద్ధ్య పరంగా తీసుకున్న ఆధునిక చర్యలకు ఫలితమని అధికారులు పేర్కొన్నారు. అలానే రాష్ట్ర స్థాయిలో రాజమహేంద్రవరానికి మినిస్టీరియల్ అవార్డు దక్కింది. నగరంలో వాడిన ప్లాస్టిక్ పరిమితి, మొబైల్ టాయిలెట్లు వంటివి ఇందుకు దోహదం చేశాయి. తిరుపతి, విజయవాడ, గుంటూరు నగరాలు స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ ఇది రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి మార్గదర్శకతకు ఇది నిదర్శనమని కొనియాడారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, కార్మిక సిబ్బంది, ప్రజల సహకారానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)