గోకర్ణ కొండ గుహల్లో రష్యన్‌ మహిళ, ఇద్దరి పిల్లలను రక్షించిన పోలీసులు

Telugu Lo Computer
0


ర్ణాటకలోని గోకర్ణలో దట్టమైన అభయారణ్యంలో ఓ కొండపై ఉన్న గుహలో రష్యా నుంచి వచ్చిన ఓ మహిళ ఇద్దరి పిల్లలతో జీవనం సాగిస్తోంది. అయితే తాజాగా ఆ కుటుంబాన్ని పోలీసులు రక్షించారు. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆశ్రమంలోకి తరలించారు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పాట్రోలింగ్ లో భాగంగా గుహలో వెళుతురు, కదలికలు గమనించి వెళ్లి చూడగా షాక్ తిన్నారు. అతి కష్టం మీద ఆ గుహలోకి వెళ్లి ఆ కుటుంబాన్ని రక్షించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆ కుటుబం రక్షణ, భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన జులై 9 వెలుగులోకి వచ్చింది. స్థానిక ఇన్ స్పెక్టర్ శ్రీధర్, అతని టీమ్ రామతీర్థ కొండపై పాట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడికి వస్తున్న భక్తులకు పలు సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొండపై గల అభయారణ్యం ప్రాంతంలో అలికిడి విన్నారు. అనంతరం కొద్దిసేపు గాలించగా గూహలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఉండటం గమనించారు. ఆమె రష్యాకు చెందిన నీనా కుటినా (40), ప్రేమ (6), అమ (4) గా గుర్తించారు. ఆమెను ఆశ్రమానికి తరలించిన పోలీసులు అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా, తాను గోవా మీదుగా గోకర్ణ వచ్చినట్లు తెలిపింది. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం తాను అలా గుహలో గడుపుతున్నానని పేర్కొంది. నగర జీవితానికి దూరంగా కొండల్లోని అడవుల్లో, గుహల్లో ఆధ్యాత్మిక జీవితం, ప్రార్థన చేసుకుంటూ జీవించాలని అనుకున్నట్లు తెలిపింది. బిజినెస్‌ వీసాపై భారత్‌ కు వచ్చింది నీనా, ఆధ్యాత్మికతకు ఆకర్షితం అయింది. గోవా నుంచి గోకర్ణకు వెళ్తున్న సమయంలో అక్కడి అడవి ప్రాంతం ఆమెకు నచ్చింది. దట్టమైన అడవులో ఉన్న గుహలో ఓ చిన్న నివాసం ఏర్పరచుకొంది. అక్కడే రుద్ర విగ్రహాన్ని పెట్టుకొని నిత్యం పూజలు చేస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)