ఆసియా కప్ 2025 టోర్నీసెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగనుంది. దీనిలో 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, హాంకాంగ్ లు ఆసియా కప్ 2025 కోసం పోటీ పడబోతున్నాయి.ఈ జట్లు 2024 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ లో పొందిన అర్హత ఆధారంగా ఎంపికయ్యాయి. మొత్తం 20 రోజుల పాటు టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025 జరగనుంది. ఈ టోర్నీలో భారత క్రికెట్ జట్టు ట్రాక్ రికార్డ్ సూపర్ గా ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్లలో ఎనిమిది సార్లు భారత్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ ఎడిషన్ ఆసియా కప్‌లో మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. భారతదేశం, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మరో గ్రూప్‌లో ఉన్నాయి. ఈ పోటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి, దుబాయ్ రెండు వేదికలలో జరుగుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులను కలిగి ఉన్నప్పటికీ, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఈ టోర్నమెంట్ తటస్థ వేదికలో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గ్రూప్ నుండి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్స్‌లో, ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒకసారి తలపడుతుంది. సూపర్ ఫోర్ దశలో ఉన్న రెండు జట్లు ఫైనల్‌కు ఆడతాయి. ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2025 టోర్నీ షెడ్యూల్ విడుదల
July 27, 2025
0
Tags