అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 12 నుండి 14 వరకు జరుగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, టీవీ, గృహోపకరణాలు, అమెజాన్ పరికరాలు, ఫ్యాషన్, బ్యూటీ, ఇల్లు, వంటగది, ఫర్నిచర్, కిరాణా వంటి అన్ని వర్గాల షాపింగ్‌లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తుంది. 2023 సెప్టెంబర్ లో లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 15, ఈ సేల్‌లో ధర తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులు లభిస్తాయి. దీనితో పాటు, EMI లావాదేవీలపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. iPhone 15 కొనుగోలుపై నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు. 128GB స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900, ఈ సేల్ సమయంలో రూ. 57,249 (బ్యాంక్ ఆఫర్‌తో సహా) కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై కస్టమర్లకు రూ.52,000 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 15 అమెజాన్ ప్రైస్ డే సేల్‌లో రూ. 10,033 ప్రారంభ EMIతో అందుబాటులో ఉంటుంది. మీకు ICICI బ్యాంక్ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ఉంటే, మీకు అదనంగా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డెలివరీ అండ్ రిటర్న్ స్ విభాగం డైరెక్టర్ అక్షయ్ సాహి మాట్లాడుతూ "ప్రైమ్ డే మా కస్టమర్లకు ఒక పండుగ, ఈ సంవత్సరం మేము దీనిని ఇప్పటివరకు అతిపెద్ద స్థాయిలో జరుపుకుంటున్నాము. వేలాది డీల్స్‌తో, ప్రైమ్ డే దేశవ్యాప్తంగా ఉన్న ప్రైమ్ సభ్యులకు అమెజాన్‌లోని ఉత్తమ అనుభవాన్ని అందిస్తుంది. అమెజాన్ సొంత AI అసిస్టెంట్ రూఫస్ ఈ సంవత్సరం మరింత మెరుగుపరచబడిందని ఆయన అన్నారు.
జూలై 12 నుండి 14 వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ : ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్
July 08, 2025
0
Tags