గ్లోబల్ మార్కెట్లో జూన్ 17 లేదా 19 తేదీన పోకో F7ని విడుదలయ్యే అవకాశం ఉంది. పోకో F7 ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అనుభవంతో శక్తివంతమైన పనితీరును అందించనుందని అంటున్నారు. పోకో ఇంకా అధికారికంగా ధరను ప్రకటించనప్పటికీ, లీకుల ప్రకారం బేస్ వేరియంట్ ధర సుమారుగా రూ. 34,999గా ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 39,999 వరకు ఉండవచ్చు. గతంలో విడుదలైన పోకో F6 బేస్ ట్రిమ్ రూ. 29,999 వద్ద ప్రారంభమైన సంగతి తెలిసిందే. పోకో F7 డివైస్ చైనాలో విడుదలైన Redmi Turbo 4 Pro కు రీబ్రాండెడ్ వర్షన్ అయి ఉండొచ్చని అంచనా. 6.83-ఇంచ్ ఫ్లాట్ OLED LTPS డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్, 16GB RAM వరకు, 512GB వరకు స్టోరేజ్. 7,550 mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్. Android 15 ఆధారిత HyperOS 2.0. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP సెకండరీ లెన్స్ ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు.
జూన్ లో పోకో F7 విడుదల ?
June 04, 2025
0
Tags