మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో ఓ స్కూల్ ని నిర్వహిస్తున్న ఆనంద్ ప్రకాశ్ ఆ పాఠశాల ప్రాంగణంలోనే తాజ్ మహల్ లాంటి ఇంటిని కట్టించుకున్నారు. ఇది నాలుగు పడకల విల్లా తరహా పాలరాయి భవనం. ఒరిజినల్ తాజ్ మహల్ నిర్మాణంలో వాడిన మక్రానా పాలరాతితోనే తన ఇంటిని నిర్మించడం విశేషం. ఆగ్రా తాజ్ మహల్ తో పోలిస్తే మూడింట ఒక వంతు మాత్రమే ఉంటుంది. కానీ, నాలుగు వైపులా పిల్లర్లు, డోమ్ అన్నీ ఒరిజినల్ ఆగ్రా తాజ్ మహల్ మాదిరిగానే ఉంటాయి. 50 ఎకరాల విశాలమైన స్థలంలో దీన్ని నిర్మించారు. ఇంటి నిర్మాణానికి ఆనంద్ ప్రకాశ్ దాదాపు రూ.2కోట్లు ఖర్చు చేశారు. ఈ ఇంటికి సంబంధించిన వీడియోను ప్రియమ్ సరస్వత్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. అచ్చం తాజ్ మహల్ ని తలపిస్తున్న ఆ ఇంటిని చూసి అంతా మైమరిచిపోతున్నారు. ఆనంద్ ప్రకాశ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన భార్యపై తనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్. అందుకే, తన ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు వెల్లడించారు. అచ్చం తాజ్ మహల్ ని పోలిన ఇంటిని నిర్మించి ఆమెకు కానుకగా ఇచ్చానని, అలా ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నానని ఆనంద్ ప్రకాశ్ వివరించారు.
తాజ్ మహల్ ని పోలిన ఇంటిని నిర్మించి భార్యకు కానుకగా ఇచ్చిన భర్త
June 15, 2025
0
Tags