న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు ఆల్‌ ఫార్మాట్‌ హెడ్‌ కోచ్‌గా రాబ్ వాల్టర్

Telugu Lo Computer
0


న్యూజిలాండ్ సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు ఆల్‌ ఫార్మాట్‌ హెడ్‌ కోచ్‌గా సౌతాఫ్రికాకు చెందిన రాబ్ వాల్టర్ నియమితుడయ్యాడు. గత నెలలో ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న గ్యారీ స్టెడ్ స్ధానాన్ని వాల్టర్ భర్తీ చేయనున్నాడు. 2028 టీ20 ప్రపంచకప్ వరకు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ న్యూజిలాండ్ క్రికెట్ శుక్రవారం ధ్రువీకరించింది. ఈ ఏడాది జూలైలో జింబాబ్వేతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లతో వాల్టర్ కివీస్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. కాగా కోచ్‌గా వాల్టర్‌కు అపారమైన అనుభవం ఉంది. మొన్నటివరకు సౌతాఫ్రికా వైట్‌బాల్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రాబ్‌ పనిచేశాడు. అతడి నేతృత్వంలోనే టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్‌కు ప్రోటీస్ జట్టు దూసుకెళ్లింది. అయినప్పటికి అతడి కాంట్రాక్ట్‌ను సౌతాఫ్రికా క్రికెట్‌ పొడిగించలేదు. అతడి స్ధానంలో ఆల్‌ ఫార్మాట్‌ హెడ్‌ కోచ్‌గా షుక్రి కాన్రాడ్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)