శ్రీశైలానికి వెళ్తున్న మినీ బస్సు దోమలపెంటలో అదుపుతప్పి బోల్తా

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి వెళ్తున్న ఓ మినీ బస్సు నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంటలో గురువారం ఉదయం బోల్తాపడింది. హైదరాబాద్‌కు చెందిన 40 మంది భక్తులు ఓ ప్రైవేటు మినీ బస్సులో శ్రీశైలానికి బయలుదేరారు. దోమలపెంట బస్టాండ్‌ వద్ద బ్రేకులు ఫెయిల్‌ కావడంతో వాహనం అదుపుతప్పింది. బస్సును అదుపు చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టింది. ఆ తర్వాత కొంతదూరం వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని కొందరికి తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దోమలపెంట జెన్‌కో ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)