ఇంధనం తక్కువగా ఉండటంతో అత్యవసర ల్యాండింగ్ అయిన ఇండిగో విమానం

Telugu Lo Computer
0


సోంలోని గువహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఇంధనం తక్కువగా ఉండటం వల్ల పైలట్ మే డే కాల్ ప్రకటించారు. దీంతో విమానం బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఇంధనం తక్కువగా ఉన్నట్లు గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి సిగ్నల్ ఇచ్చారు. మే డే.. మేడే.. ఫ్యూయల్ డౌన్ సంకేతం ఇవ్వడంతో వెంటనే ఏటీసీ అప్రమత్తం అయింది. విమానాశ్రయంలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో వాళ్లు విమానం ల్యాండింగ్ అయిన ప్రాంతానికి మెడికల్, ఎమర్జెన్సీ కిట్స్ తో వెళ్లారు. విమానం సేఫ్ గా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)