కర్ణాటకలోని చిత్రదుర్గ్ కు చెందిన కార్తీక రెండేళ్ల క్రితం తనూజను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత అదనపు కట్నం కోసం తనూజను వేధించిన కార్తీక్ ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టి మరో పెళ్ళికి సిద్ధం అయ్యాడు. కార్తీక్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న తనూజ ఆమె తల్లిదండ్రులు పెళ్లి మండపానికి చేరుకొని, పెళ్లి మండపంలో అతిధులు అందరూ చూస్తుండగానే భర్తను గొడ్డును బాదినట్టు బాదింది. అంతేకాదు ఆమె తల్లిదండ్రుల వర్గం అందరితో కలిసి చెప్పులతో కొట్టారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో చివరికి గొడవ సద్దుమణిగింది.
రెండో పెళ్లి చేసుకుంటున్న భర్తను పెళ్లి మండపంలో దేహశుద్ధి చేసిన భార్య
June 09, 2025
0
Tags