ఉన్నతాధికారులకు తెలియకుండా నేను ఏ పనీ చేయలేదు !

Telugu Lo Computer
0


తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఈరోజు సిట్‌ ముందు విచారణ నిమిత్త హాజరయ్యారు. ప్రభాకర్‌రావు నిన్న అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. తాను ఎఫ్‌ఐబీలో పనిచేస్తున్నప్పటికీ తనపై అధికారులు ఉన్నారని తన పైఅధికారులకు తాను చేసిన ప్రతీ పనీ తెలుసన్నారు. తాను చేసిన ప్రతీ పనికి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, వారికి తెలియకుఉండా తాను ఏ పనీ చేయలేదన్నారు. అయితే ఎస్‌ఐబీ కార్యాలయంలో ధ్వంసమైన హార్డ్‌ డిస్క్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సిట్‌ అధికారులకు ప్రభాకర్‌రావు చెప్పలేనట్లుగా తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉండి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌రావు సిట్‌ విచారణకు హాజరు కావడానికి హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న కోణంలోనే ప్రధానంగా విచారణ జరిగే అవకాశం ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)