తెలంగాణ మంత్రులుగా వివేక్‌, లక్ష్మణ్‌, శ్రీహరిలు ప్రమాణం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ రాజభవన్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌, వివేక్‌ వెంకటస్వామి, వాకిటి శ్రీహరిలు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వారి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన మంత్రులకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. అంతకుముందు నూతన మంత్రులకు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో అగ్ర వర్ణాలకు అవకాశాలు కల్పించనున్నట్టు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, సామాజిక న్యాయం అమలు చేస్తూ మంత్రి వర్గ కూర్పు జరుగుతోందని అన్నారు. త్వరలో మరో ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)