దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న 'సుపరిపాలన-తొలి అడుగు' సదస్సులో ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొని మాట్లాడుతూ దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని 50 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ సేవలందిస్తోందని చెప్పారు. జీవన్‌జ్యోతి యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ నీటిసరఫరా చేస్తున్నామని వివరించారు. కొవిడ్‌ సమయంలో కేంద్రం అనేక ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని చెప్పారు. 'సుపరిపాలన - తొలి అడుగు' సదస్సుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)