జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చాలా కాలంగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లుగా తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ కు కిడ్నీ సమస్యలు ఉన్నాయి. సమస్యను నిర్లక్ష్యం చేయడంతో పెరిగి పెద్దదయిపోయింది. ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యం ఏర్పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన ఏఐజీలోనే చికిత్స పొందుతున్నారు. ఏఐజీలో మాగంటి గోపీనాథ్ ను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెండు సార్లు పరామర్శించారు. ఆయనకు విదేశీ వైద్యం చేయించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే వైద్యులు పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పారు. గత ఫిబ్రవరి నుంచి ఆయన ప్రాణం కాపాడటానికి విదేశీ వైద్యుల సలహాలతో చాలా ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఇచ్చారు. హరీష్ రావుతో పాటు ఇతర సీనియర్ నేతలు ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నిండా ముఫ్పై ఏళ్లు నిండక ముందు టీడీపీ రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్ లో ఆయన ప్రముఖ నేతగా ఎదిగారు. యువ నేతగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2014లో ఆయనకు మొదటి సారిగా టీడీపీ టిక్కెట్ జూబ్లీహిల్స్ నుంచి లభించింది. ఆ ఎన్నికల్లో ఆయన పది వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి మళ్లీ 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. జూబ్లీహిల్స్ నుంచి గత ఎన్నికల్లో అజరుద్దీన్ పై విజయం సాధించారు

Post a Comment

0Comments

Post a Comment (0)