కాళేశ్వరం కమిషన్ కు ఆధారాలతో సమాధానాలు చెప్పను !

Telugu Lo Computer
0


మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు హరీశ్ రావు విచారణ జరిగింది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు హరీష్ రావు తెలిపారు. మొత్తం 20 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడగగా ఆధారాలతో సమాధానాలు సమర్పించానని వెల్లడించారు. మాజీ మంత్రి ఇచ్చిన సమాధానాలకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీశ్ రావు వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ గోష్ కమిషన్ విచారించింది. తాను తెలుగు మీడియం స్టూడెంట్ ను కాబట్టి పూర్తిస్థాయిలో ఇంగ్లీషును మాట్లాడలేనని అర్థం చేసుకోగలనని కమిషన్ కు హరీష్ రావు చెప్పారని తెలుస్తోంది. దీంతో ఈ అంశాన్ని జడ్జి పరిగణలో తీసుకొని ఇంగ్లీష్ ఇబ్బంది అయితే హిందీలో చెప్పవచ్చు లేదా తెలుగులో చెప్పిన తనకు ట్రాన్స్ లేట్ చేసేవారు ఉన్నారని తెలిపారు. అయితే, కమిషన్ విచారణలో భాగంగా కొన్ని సందర్భాల్లో జడ్జి అడిగిన ప్రశ్నలను హరీశ్ రావు అర్థం చేసుకోలేకపోయారని సమాచారం. ముఖ్యంగా టెక్నికల్ అంశాలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు అది అధికారులు చూసుకున్నారని మాత్రమే హరీశ్ రావు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు రీ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్‌రావును కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడి హట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసి ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. దానికి సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్‌ను తయారు చేసి పనులను కూడా ప్రారంభించిందని తెలిపారు. అయితే పనులను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని, ఆ సమయంలో మహారాష్ట్రలోనూ, తెలంగాణలోనూ, సెంట్రల్‌లో కూడా కాంగ్రెస్ సర్కారే ఉందన్నారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన సమాధానాలకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది

Post a Comment

0Comments

Post a Comment (0)