జలహారతి కార్పోరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జలహారతి కార్పోరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం తన సొంత నిధులతో కంపెనీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు జలహారతి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటి వినియోగం కోసం జలహారతి కార్పోరేషన్ పని చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలోని రూం నెం 4, మొదటి అంతస్తు, రైతుల ట్రైనింగ్ సెంటర్, ఇరిగేషన్ కాంపౌండ్, గవర్నర్ పేట, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ పిన్ 520002లో జలహారతి కార్పోరేషన్ కార్యాలయంగా పేర్కోంటూ ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)