ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శిపై వేటు

Telugu Lo Computer
0


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి కే.గోవిందరాజ్‌ను పదవి నుంచి తొలగించారు. అలాగే బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సీ. బాలకృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్ డివిజన్) శేఖర్ హెచ్. టెక్కన్నవర్, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్‌ కుమార్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ ఏకే గిరీష్‌లను వెంటనే సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)