తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని ఇటిక్యాల గ్రామ సమీపంలో రెండు లారీలు ఢీకొనడంతో ఒక డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వాటిలో ఒకటి సంతూర్ సబ్బులతో వెళ్తున్న లారీ. ఇందులోని సబ్బులు రోడ్డు మీద పడటంతో పెద్ద సంఖ్యలో జనం ఎగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకునేలోగా లారీ లోడులో సగం అయ్యింది. దాదాపుగా రూ.లక్ష ఖరీదైన సబ్బులను స్థానిక ప్రజలు తీసుకెళ్లిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఘటనా ప్రాంతంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెండు లారీలు ఢీకొనడంతో డ్రైవర్ మృతి : సంతూర్ సబ్బుల కోసం ఎగబడ్డ జనం
June 26, 2025
0
Tags