ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో ఇటీవల ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డు మీద లాఠీలతో తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ అయింది. అయితే పోలీసులపై దాడి చేశారని, గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పాలని అంతా చూస్తుండగానే వారికి బుద్ధి చెప్పినట్లు తెనాలి పోలీసులు తెలిపారు. తన భర్త అయిన కానిస్టేబుల్ పై హత్యాయత్నం జరిగితే కొందరు ఆ రౌడీ బ్యాచ్ కు మద్దతు తెలపడం ఏంటని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ క్రమంలో తెనాలిలో జరిగిన ఘటన మరో వివాదానికి దారితీసింది. ఇటీవల ముగ్గురు యువకులను లాఠీలతో కొట్టిన పోలీసుల దాడులు, వేధింపులతో మరో విషాదం చోటుచేసుకుందని వైసీపీ ఆరోపించింది. అదే తెనాలి పోలీసుల వేధింపులతో సిద్దేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ నేతలు అన్నారు. ఇటీవల తెనాలిలో పట్టపగలు ముగ్గురు దళిత యువకులపై దారుణంగా దాడి చేస్తూ వీడియోలో కనిపించిన పోలీసుల తప్పిదంతో స్థానిక నివాసి శివ బట్టి కుమారుడు సిద్ధేష్ అనే మరో యువకుడు బలవన్మరణం చెందాడని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎం.ఎం. జ్యువెలరీ బంగారు రికవరీ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా సిద్ధేష్ను పోలీసులు అవమానించి, మానసికంగా వేధించారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసుల వేధింపులు, ఒత్తిడిని తట్టుకోలేక సిద్దేష్ ఆత్మహత్య చేసుకున్నాడని.. ఈ ఘటనను దాచిపెట్టడానికి యువకుడి మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించారని వైసీపీ అధినేత జగన్ అనుమానం వ్యక్తం చేశారు. తెనాలి పోలీసుల దురుసు ప్రవర్తన, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారుల క్రమశిక్షణారాహిత్యంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ క్రమంలో జూన్ 3న తెనాలికి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. తెనాలి పోలీసుల థర్డ్ డిగ్రీ దాడిలో గాయపడిన దళిత, ముస్లిం యువకులను జగన్ పరామర్శించనున్నారు.
తెనాలిలో యువకుడు ఆత్మహత్య
June 02, 2025
0
Tags