దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన 'సంవిధాన్ హత్యా దివస్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరేళ్ల కిందట ఇదే రోజు ప్రజా వేదిక కూల్చారని, ప్రజావేదిక కూల్చివేతకు ఆరేళ్లు సందర్భంగా ఈ సంవిధాన్ హత్యా దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ''ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంస పాలనకు తెరతీసింది. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలన గత ఐదేళ్లూ చూశాం. ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదు. నియంతలకు చోటులేదని ఓటుహక్కు ద్వారా ప్రజలు చాటిచెప్పారు. కూల్చివేత నేతలను పంపించి.. పునర్మిర్మాణ బాధ్యతలు మాకు ఇచ్చారు. రాష్ట్ర పురోగతి కోసం కసి, పట్టుదలతో పనిచేస్తున్నాం'' అన్నారు.
ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంస పాలనకు తెరతీసింది : చంద్రబాబు నాయుడు
June 25, 2025
0
Tags