ఆంధ్రప్రదేశ్ లోని బుగ్గ మఠం భూముల విషయమై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బుగ్గ మఠం భూములపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనంతరం, వారం రోజుల్లోగా పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జవాబు చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్‌పై వారం రోజుల్లోగా పిటిషనర్ రిజైన్డర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సమయం ఇచ్చింది. అప్పటివరకు భూములపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది.
బుగ్గ మఠం భూముల విషయమై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ
June 02, 2025
0
Tags