హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రముఖ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటుల చేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు చేప ప్రసాదం పొందేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్‌లో నిలబడి ఉన్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయనను పరీక్షించి వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేశారు. అయితే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి
June 08, 2025
0
Tags