తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీనివాస్‌ను ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. రావి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కపై విమర్శలు చేశారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టీపీసీసీ క్రమశిక్షణ చర్య కమిటీ (డీఏసీ) ఛైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోపు వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో పార్టీ నియమావళిని అనుసరించి చర్యలుంటాయని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రావి శ్రీనివాస్ నుంచి సరైన వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు
June 29, 2025
0
Tags