జాతీయ కుటుంబ ప్రయోజన యోజన పధకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించింది. తగినంత ప్రచారం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో లబ్ధిదారులకు చేరువ కాలేకపోతోంది. దరఖాస్తుల సంఖ్య నామమాత్రంగా ఉండటం ఈ పథకం ప్రచారంలో అధికార యంత్రాంగం వైఫల్యాన్ని స్పష్టం చేస్తుంది. పేదరికపు గీతకు దిగువన ఉన్న కుటుంబాల్లో కుటుంబ పెద్ద మరణించినప్పుడు రూ.20,000 ఆర్థిక సాయం అందించడం ఈ ఈ పథకం ఉద్దేశం. కుటుంబ పెద్ద 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు సంభవించిన మరణం ఏదైనా మరణించిన రెండేళ్లలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సహాయం సాధారణంగా కుటుంబంలోని వితంతువుకు లేదా అవివాహిత కుమార్తెకు లభిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ కోసం గ్రామ, మండల స్థాయి అధికారుల ద్వారా సంబంధిత పత్రాలతో మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించాలి. ఆమోదం పొందిన తర్వాత సహాయం కోసం ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం నమోదు చేయబడుతుంది.
ఆశించిన స్థాయిలో లబ్ధిదారులకు చేరువ కాలేకపోతున్న జాతీయ కుటుంబ ప్రయోజన యోజన పథకం
June 07, 2025
0
Tags