ఎస్‌ఎంఎస్‌ ఆధారంగా మర్డర్ కేసును చేధించిన పోలీసులు

Telugu Lo Computer
0


ర్ణాటక లోని గడగ్ జిల్లా నారాయణపుర గ్రామానికి చెందిన సతీష్ హిరేమత్, అదే గ్రామానికి చెందిన మధుశ్రీ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ఒత్తిడి తెచ్చినందుకు మధుశ్రీని సతీష్ ఆమెను హత్య చేశాడు.  2024 డిసెంబర్ 16న మధుశ్రీ గడగ్‌లోని తన బంధువుల ఇంటి నుండి అదృశ్యమైంది. బంధువులు వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో 2025 జనవరి 12న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రారంభ దశలో సతీష్‌ను ప్రశ్నించగా, అతను మధుశ్రీని వదిలేసి పనికి వెళ్లిపోయానన్న చెప్పాడు. అయితే, సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరూ ఒకే బైక్‌పై కనిపించడంతో అతనిపై అనుమానం బలపడింది. ఒక రోజు సతీష్ మొబైల్‌కి వచ్చిన కంపెనీ మెసేజ్‌ వల్ల మొత్తం కథే తారుమారైంది. అతను చెప్పిన లొకేషన్‌కి విరుద్ధంగా, ఫోన్ వాస్తవికంగా మరొక ప్రదేశంలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు మళ్ళీ విచారణ చేపట్టగా, చివరికి అతను మధుశ్రీని చంపినట్లు అంగీకరించాడు. మధుశ్రీ పెళ్లి కోసం ఒత్తిడి చేస్తుండగా సతీష్ తన పొలానికి తీసుకెళ్లి  గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేసి ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశాడు. తరచూ వచ్చి ఎముకలను వేరే ప్రదేశాలకు తరలించేవాడు. అతని ఫోన్ కి వచ్చిన ఎస్‌ఎంఎస్‌ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. పోలీసులు సూచించిన ప్రదేశంలో మృతదేహ అవశేషాలను కనుగొన్నారు. వాటిని డిఎన్‌ఎ పరీక్షకు పంపించారు. ఇప్పటికీ పూర్తి అవశేషాలు లభించలేదు. ఈ కేసు చుట్టూ నాటకీయ మలుపులు ఉండటంతో, పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకుని నిజాన్ని వెలికి తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)