చెన్నైలోని నటుడు ఆర్య నివాసంతో పాటు ఆయనకు సంబంధమున్న వ్యాపార సంస్థలపై బుధవారం ఉదయం నుంచి ఆదాయ పన్ను శాఖ వారు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ముఖ్యంగా చెన్నైలోని అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్‌ల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్లపై జరుగుతున్నాయి. అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలోనే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్యపై ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, సరైన పన్నులు చెల్లించలేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్టు సమాచారం. కాగా, సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్య, వ్యాపారవేత్తగా కూడా తన మార్క్ చూపించాడు. గతంలో సీ షెల్ రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. కానీ ఆ తర్వాత ఈ రెస్టారెంట్లను కేరళకు చెందిన కున్హి మూసా అనే వ్యాపారవేత్తకు విక్రయించినట్లు సమాచారం. ఈ దాడులపై స్పందించిన ఆర్య.. సీ షెల్ రెస్టారెంట్లతో తనకు సంబంధం లేదని స్థానిక మీడియాతో చెప్పారు.
నటుడు ఆర్య ఇంట్లో ఐటీ సోదాలు
June 18, 2025
0
Tags