తెలంగాణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం విద్య, వైద్యం, వ్యవసాయం

Telugu Lo Computer
0


తెలంగాణ లోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయంపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రధాన లక్ష్యం విద్య, వైద్యం, వ్యవసాయమని, ఈ విషయంలో పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వ్యవసాయానికి పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కర్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. కరీంనగర్‌ జిల్లాలో ఒక్క గుంట కూడా బీడు భూమి లేకుండా సాగుచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు వివరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)