ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ గార్డ్ అందుబాటులో ఉంది. దీనిని తీసుకుంటే నెలకు 62 రూపాయలు కట్టి 15 లక్షల ఇన్సూరెన్స్తో పాటు అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. జీఏజీ పాలసీకి అప్లై చేయాలనుకుంటే ముందుగా పోస్ట్ ఆఫీస్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్లో ఈ అకౌంట్ కావాలి అంటే చాలా ఈజీగా ఇచ్చేస్తారు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి 300 ఖర్చు అవుతుంది. దీనిలో అకౌంట్లో 125, ప్రీమియం కోసం 175. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత దానిలో 755 Group Accident Insurence Policy తీసుకోవాలి. ప్రతి నెల 62 రూపాయలు అలా సంవత్సరానికి 755 కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల 15 లక్షల యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ కవర్ అవుతుంది. Annual Premium 15 లక్షలు కాగా, Sum Insured 15 లక్షలు అందుతుంది. ప్రమాదంలో చనిపోయినా, శాశ్వతంగా మంచానికి పరిమితమైనా 100 శాతం ఇన్సూరెన్స్ అందుతుంది. పిల్లల పెళ్లికి 1 లక్ష, చదువునకు 5000 వేలు కూడా అందుతాయి. పాలసీ తీసుకున్నవారు ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి రెండు రోజుల్లో 15 లక్షలు క్లైమ్ అవుతాయి. మెడికల్ బిల్ కింద లక్ష కూడా వస్తుంది. ఈ పాలసీని ప్రతి సంవత్సరానికి ఓసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 65 సంవత్సరాలు ఉండే ప్రతి ఒక్కరు దీనికి అర్హులే. మరి ఈ పాలసీని తీసుకోవాలనుకుంటే మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. సూసైడ్, Illeagal Act, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, రోగాలు, ఎయిడ్స్ వంటివి ఉన్నవారికి ఈ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు.
గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ గార్డ్ : నెలకు 62 రూపాయలు కడితే 15 లక్షల ఇన్సూరెన్స్
June 21, 2025
0
Tags