దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 1,131 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు కరోనా కారణంగా మృతి చెందారు. యాక్టీవ్ కేసులలో కేరళ 1950 మందితో కేరళ మొదటి స్థానంలో ఉంది. అలాగే గుజరాత్ లో 822, బెంగాల్ 693 కేసులు, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 86, తెలంగాణలో 10 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)