మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల

Telugu Lo Computer
0


ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్  మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 షెడ్యూల్‌ను ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30, 2025 నుంచి నవంబర్ 2, 2025 వరకు భారతదేశం, శ్రీలంకలో జరగనుంది. ఈ 13వ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, మరియు పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. కాగా ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2022లో ఏడవ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ రోజు మధ్యాహ్నం ఐసీసీ వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది. మొదటి మ్యాచ్ ఆతిథ్య జట్లు అయిన భారత్, శ్రీలంక మధ్య బెంగళూరు వేదికగా సెప్టెంబర్ 30న జరగనుంది. అలాగే లీగ్ స్టేజిలోని చివరి మ్యాచ్ అక్టోబర్ 26న భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. సెమీఫైనల్ 1 మ్యాచ్ కొలంబోలో జరగనుండగా.. సెమీ ఫైనల్ 2 మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. అలాగే ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న కొలంబో లేదా బెంగళూరులో అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి నిర్వహించనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)